Srinivasa Mangapuram Movie: శ్రీనివాస మంగాపురంలో రవీనా టాండన్ కూతురు రాషా థడానీ
రవీనా టాండన్ కూతురు రాషా థడానీ

Srinivasa Mangapuram Movie: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా థడానీ సింగర్‌గా మంచి గుర్తింపును అందుకుంది. రీసెంట్‌గా ‘ఆజాద్’ చిత్రంతో హిందీలో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె.. తాజాగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఘట్టమనేని వారసుడు, కృష్ణ మనవుడు, రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం కాబోతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. శుక్రవారం రాషా థడానీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు ఆమె పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో ఆమె మంగా అనే పాత్రలో కనిపించనున్నట్టు రివీల్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంప్రెస్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే 30 రోజుల పాటు సాగిన ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకోగా, ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్‌లోకి ఎంటర్ అయ్యింది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

