'Irumudi' movie: రవితేజ ఇరుముడి డబ్బింగ్ షురూ.. "ఒకే ఒక్క కూతురు... మణెమ్మ" డైలాగ్ వైరల్..
మణెమ్మ" డైలాగ్ వైరల్..

'Irumudi' movie: మాస్ మహారాజా రవితేజ హీరోగా, ప్రతిభావంతుడైన దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎమోషనల్ అండ్ కమర్షియల్ డ్రామా ఇరుముడి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రవితేజ గురువారం డబ్బింగ్ పనులను అధికారికంగా ప్రారంభించారు.
డబ్బింగ్ వీడియోలో రవితేజ పవర్ ఫుల్ డైలాగ్
స్టూడియోలో రవితేజ డబ్బింగ్ చెప్తున్న వీడియోను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో రవితేజ"నాకు ఒకే ఒక్క కూతురు... ఆమె పేరు మణెమ్మ" అని చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన ఆసక్తిని పెంచుతోంది. ఈ డబ్బింగ్ సెషన్‌లో దర్శకుడు శివ నిర్వాణతో పాటు బాలనటి నక్షత్ర కూడా పాల్గొన్నారు.
కథ నేపథ్యం:
కూతురిపై ప్రాణంగా ప్రేమించే తండ్రి పాత్రలో రవితేజ కనిపిస్తారు. కొన్ని అనూహ్య పరిణామాల వల్ల మద్యానికి బానిసైన కథానాయకుడు, తన కూతురి కోరిక మేరకు అయ్యప్ప మాల ధరించి తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడనేది ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం.
చిత్రీకరణ: కేవలం మరో మూడు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ రీ-రికార్డింగ్ పనులను వేగవంతం చేశారు.
తారాగణం - నిర్మాణ వివరాలు..
రవితేజ కెరీర్‌లో 77వ చిత్రంగా వస్తున్న ఈ పవర్ ఫుల్ తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ కథను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
భక్తి, సెంటిమెంట్, మాస్ ఎలిమెంట్స్ సమపాళ్లలో మిళితమైన ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

