రవితేజ స్టెప్పులు

Ravi Teja Movie: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' నుంచి మూడవ సాంగ్ 'వామ్మో వాయ్యో' విడుదలకు సిద్ధమైంది.

వామ్మో వాయ్యో పాటను జనవరి 2, 2026న విడుదల చేయబోతున్నారు.వరంగల్‌లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో ఈ పాటను విడుదల చేయనున్నారు.ఇది ఒక పక్కా మాస్ నంబర్.ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ నిన్ననే (డిసెంబర్ 31) విడుదల చేశారు. రవితేజ ఎనర్జీ, భీమ్స్ మాస్ బీట్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ పాటలో రవితేజతో పాటు హీరోయిన్లు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కూడా ఆకట్టుకునే స్టెప్పులతో కనిపించబోతున్నారు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తోన్నఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే సగటు భర్త కష్టాలను కామెడీగా చూపిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన 'బెల్లా బెల్లా,అద్దం ముందు' పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జనవరి 13, 2026న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story