రాజాసాబ్ నుంచి.. రెబల్ సాబ్ సాంగ్ రిలీజ్
రెబల్ సాబ్ సాంగ్ రిలీజ్

ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం 'ది రాజా సాబ్' నుంచి మొదటి పాట (ఫస్ట్ సింగిల్) విడుదలైంది.'రెబెల్ సాబ్' (Rebel Saab) అనే ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు ఎస్. థమన్ మ్యూజిక్ అందించారు ఈ సాంగ్ కు తెలుగులో సంజిత్ హెగ్డే , బ్లేజ్ పాడారు.
ఈ పాట ఒక మాస్, ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ గా ఉంది. ఇందులో ప్రభాస్ ఒక స్టైలిష్, కలర్‌ఫుల్ లుక్‌లో కనిపించడం, అలాగే ఆయన మాస్ స్టెప్పులు వేయడం అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సాంగ్
ఈ పాట తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలైంది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన ప్రధానంగా నిధి అగర్వాల్,మాళవిక మోహనన్ , బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. 'సలార్', 'కల్కి 2898 AD', 'స్పిరిట్' వంటి భారీ ప్రాజెక్టుల మధ్యలో ప్రభాస్ ఒక వినోదాత్మక చిత్రంతో రావడం వలన ఈ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.ఈ హారర్ థ్రిల్లర్ మూవీ 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

