Prabhas ‘Fauzi’: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే వేళ ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ దక్కింది. ప్రభాస్ హీరోగా ప్రతిభావంతుడైన దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ వార్ డ్రామా ఫౌజీ నుంచి మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్‌తో ముందుకొచ్చారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ విడుదల చేసిన వింటేజ్ పోస్టర్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ఆకట్టుకుంటున్న మిలటరీ లుక్.. పోస్టర్ వెనుక దాగున్న మిస్టరీ!

తాజాగా విడుదలైన పోస్టర్ డిజైన్ అత్యంత వినూత్నంగా, ఆసక్తికరంగా ఉంది. మండుతున్న అగ్ని కీలల మధ్య ఓ పురాతన బంగారు నాణెంపై ఆర్మీ దుస్తుల్లో ఉన్న ప్రభాస్ సైడ్ ప్రొఫైల్‌ను చూపించిన తీరు అభిమానులను కట్టిపడేస్తోంది. పోస్టర్‌పై పొందుపరిచిన "ఫైల్ నెం: #25 డిక్లాసిఫైడ్", "ఒంటరిగా పోరాడే ఒకే ఒక్క బెటాలియన్", "1939 నుంచి మోస్ట్ వాంటెడ్" అనే లైన్స్ సినిమా కాన్సెప్ట్‌పై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఒక ధైర్యవంతుడైన సైనికుడి నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథ ఉండబోతోందని తాజా పోస్టర్ స్పష్టం చేస్తోంది.

"అతను ఎవరు?"

పోస్టర్‌తో పాటు మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ సినీ ప్రియుల్లో మరింత క్యూరియాసిటీని పెంచింది. "అసలు ఈ పోరాట యోధుడు ఎవరు? ఆయన గతం ఏమిటి?" అనే ప్రశ్నలకు సమాధానమిస్తూ, ప్రభాస్ పాత్రను పరిచయం చేసే సరికొత్త క్యారెక్టర్ గ్లింప్స్ వీడియోను నేడే విడుదల చేయనున్నట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది. సీతారామంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న హను రాఘవపూడి.. ఈ చిత్రంలో ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ రోల్‌లో ప్రెజెంట్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. పుట్టినరోజు కానుకగా వచ్చిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తుండగా, త్వరలో రానున్న ఇంట్రడక్షన్ వీడియో కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

Next Story