అల్లు అర్జున్ - లోకేశ్ మూవీ అనౌన్స్‌మెంట్‌తోనే ఇంటర్నెట్ షేక్..

Allu Arjun–Lokesh Film Announcement: పుష్ప సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందన్న అధికారిక ప్రకటన వెలువడగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం విడుదల చేసిన ఒక చిన్న అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డుల సునామీ సృష్టిస్తోంది.

సరికొత్త సోషల్ మీడియా రికార్డ్

సాధారణంగా సినిమాలకు టీజర్ లేదా ట్రైలర్ వచ్చినప్పుడు రికార్డులు మారుతుంటాయి. కానీ ‘AA-23’ విషయంలో కేవలం సినిమాను అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన వీడియోకే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అనౌన్స్‌మెంట్ వీడియోకు ఏకంగా 3.55 మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. ఇండియాలో ఒక మూవీ అనౌన్స్‌మెంట్ వీడియోకు ఈ స్థాయి ఆదరణ రావడం ఇదే తొలిసారి.

అనిరుధ్ మ్యాజిక్:

ఈ వీడియోకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ మ్యూజిక్ ఎంతగా వైరల్ అయిందంటే.. దాదాపు 3.5 లక్షలకు పైగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఈ థీమ్ మ్యూజిక్‌తోనే రూపొందించబడ్డాయి.

ప్రాజెక్ట్ హైలైట్స్

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. యానిమేషన్ గ్లింప్స్‌లో చూపించిన విజువల్స్ చూస్తుంటే, లోకేశ్ మార్క్ డార్క్ థ్రిల్లర్ లేదా ఒక విలక్షణమైన యాక్షన్ అడ్వెంచర్ ఉండబోతుందని అర్థమవుతోంది.

అట్లీ ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. 2026 ద్వితీయార్ధంలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story