బాధ మీకెందుకు

Regina Cassandra Fires Back: తమిళంలో 2005లో విడుదలైన కండనాళ్ మొదల్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నటి రెజీనా. ఆ తర్వాత అసుర చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టినా, శివకా ర్తీకేయనక్కు జంటగా నటించిన కేడీబి కిల్లాడి రంగా చిత్రంతో మంచి విజ యాన్ని అందుకున్నారు. ఆ తరువాత తెలుగు, కన్నడం భాషల్లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే కొంత కాలంగా సరైన అవకా శాలు రావడం లేదనే చెప్పాలి. దీంతో ప్రత్యేక పాటల్లో నటించడంతోపాటు ప్రతినాయకి పాత్రల్లో నటించడానికి సై అన్నారు. అదే సమయంలో వెబ్ సిరీస్లో నూ నటించడం ప్రారంభించారు. ఇలా వచ్చిన అవకాశాలను అందిపుచ్చు కుంటున్న రెజీనా చాలా బోల్డ్ నటి అనే ముద్ర వేసుకున్నా రు. అందాలారబోతకు నో చెప్పని ఈ భామ వయసు 34 సంవత్సరాలు. ఇటీవల ఒక భేటీలో 34 ఏళ్లు వచ్చాయి. పెళ్లెప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నకు ముక్కు సూటిగా బదులిచ్చిన రెజీనా పెళ్లెప్పుడు చేసుకుంటా వని తన తల్లే అడగదని, మీరెందుకు అడుగుతు న్నారు? మీకెందుకు అంటూ ఫైర్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఈ అమ్మడి పై రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు.అసలు పెళ్లి చేసుకుంటారా? లేక అవివాహితగానే ఉండిపోతారా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా నటి రెజీనా కస్సాండ్రా తమిళనాడు రాష్ట్రంలోని మద్రాస్ లో 1990 డిసెంబర్ 13న జన్మించింది. ప్రస్తుతం ఆమెకు 34 ఏళ్లు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి బీజీఎస్సీ సైకాలజీ విభాగంలో పట్టా పొందింది. తమిళ్ ఫ్యామిలీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు భాషలోనూ అనర్గళంగా మాట్లాడుతుంది. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలు మూక్తి అమ్మన్ 2, ఫ్లాష్ బ్యాక్, హిందీలో సెక్షన్ 108 వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story