హైకోర్టులో ఊరట

Shah Rukh Khan and Deepika Padukone: రాజస్థాన్‌ హైకోర్టు ఒక కారు ప్రకటనకు సంబంధించిన కేసులో షారుక్ ఖాన్, దీపికా పదుకొణెలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తప్పుడు ప్రకటనలతో కస్టమర్లను మోసం చేశారనే ఆరోపణలతో హ్యుందాయ్ కంపెనీ అధికారులతో పాటు వారిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో వారికి బెయిల్ లభించింది.రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాకు చెందిన కీర్తి సింగ్ అనే వ్యక్తి ఈ కేసును దాఖలు చేశారు.కీర్తి సింగ్ 2022లో హ్యుందాయ్ అల్కాజార్ కారును సుమారు రూ. 24 లక్షలకు కొనుగోలు చేశారు. అయితే, కారు కొన్న ఆరు నెలల్లోనే ఇంజిన్‌కు సంబంధించిన సాంకేతిక లోపాలు తలెత్తాయి. తాను ఈ విషయాన్ని డీలర్‌షిప్ మరియు కంపెనీ దృష్టికి తీసుకెళ్ళినా సమస్య పరిష్కారం కాలేదని ఆయన ఆరోపించారు.షారుక్ ఖాన్, దీపికా పదుకొణెలు హ్యుందాయ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఈ కారు ప్రకటనలో వారి ప్రచారం చూసే తాను ఆ కారును కొనుగోలు చేశానని కీర్తి సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండి, లోపాలున్న ఉత్పత్తిని ప్రచారం చేయడం ద్వారా వినియోగదారులను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు. దీనిపై పోలీసులు వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.హైకోర్టు ఈ వాదనలను పరిగణనలోకి తీసుకుంది. ఎఫ్ఐఆర్‌లో నటులపై నేరపూరితమైన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు విచారణ కొనసాగుతుందని, అయితే నటులకు తాత్కాలికంగా ఉపశమనం లభించిందని తెలిపింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story