నటుడు డేన్ కన్నుమూత

Hollywood Actor Dane: ప్రముఖ హాలీవుడ్ నటుడు ఎరిక్ డేన్ (Eric Dane) (53)కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ALS (Amyotrophic Lateral Sclerosis) అనే నాడీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు..ఆయన మరణం పట్ల సినీ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

2006లో వచ్చిన 'X-Men: The Last Stand' సినిమాలో ఆయన 'జేమీ మాడ్రాక్స్ / మల్టిపుల్ మ్యాన్' (Multiple Man) అనే పాత్రను పోషించారు. తనలాంటి అనేక రూపాలను సృష్టించుకునే ఈ మ్యూటెంట్ పాత్ర ప్రేక్షకులను అలరించింది.X-Men' మాత్రమే కాకుండా, మెడికల్ డ్రామా సిరీస్ Grey's Anatomyలో డాక్టర్ మార్క్ స్లోన్ పాత్రతో ఆయన అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందారు. అలాగే 'Euphoria' సిరీస్‌లో కాల్ జాకబ్స్‌గా కూడా నటించారు.

ఎరిక్ డేన్ తన చివరి రోజుల్లో ALS వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎంతో కృషి చేశారు. ఆయన మరణం పట్ల ఆయన భార్య రెబెక్కా గేహార్ట్ , ఇద్దరు కుమార్తెలు తీవ్ర దుఃఖంలో ఉన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story