రేణుదేశాయ్ ఆసక్తికర పోస్ట్

Renu Desai’s Interesting Post: నటి, నిర్మాత అయిన రేణు దేశాయ్ గారు ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా తన వ్యక్తిగత అభిప్రాయాలు, ఆధ్యాత్మిక విషయాలు, సామాజిక అంశాలపై పోస్టులు పెడుతూ ఉంటారు. లేటెస్ట్ గా ఆమె పోస్ట్ చేసిన అత్యంత ముఖ్యమైన, వైరల్ అయిన పోస్ట్ ఆధ్యాత్మికం సంబంధించినది.రేణు దేశాయ్ ఇటీవలే కాశీ (వారణాసి) క్షేత్రాన్ని సందర్శించి, అక్కడ కాల భైరవ జయంతి సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన ఫోటోలు, భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

ఆమె కాశీ క్షేత్ర పాలకుడు అయిన కాల భైరవ జయంతి సందర్భంగా ఈ పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్‌లో ఆమె ఇలా రాశారు."ఈ రోజు కాల భైరవ జయంతి రోజున మనం రక్షణ కోరకూడదు... మనమే రక్షకుడిగా మారాలి. కాల భైరవుడు మీతో పాటు నడుస్తూ, ప్రశాంతమైన శాంతి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు.""ఆ పరమ శివుడు మిమ్మల్ని పిలిచినప్పుడు, మీరు అన్ని లౌకిక విషయాలను వదిలిపెట్టి కాశీకి వెళ్తారు."ఈ పోస్ట్‌తో పాటు, కాశీ ఘాట్‌ల వద్ద, ఆలయాల ప్రాంగణంలో సాంప్రదాయ దుస్తుల్లో దిగిన ఫోటోలను కూడా ఆమె పంచుకున్నారు. భవిష్యత్తులో తాను సన్యాసం తీసుకునే అవకాశం ఉందని గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా అభిమానులు ఈ పోస్ట్ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story