Colors Swathi: సీక్రెట్ గా డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి
కలర్స్ స్వాతి

Colors Swathi: తెలుగు ప్రేక్షకుల అభిమాన 'కలర్స్' స్వాతి తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. కొంతకాలంగా సినీ పరిశ్రమకు, సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్న స్వాతి.. తాజాగా తన పెళ్లి వార్తతో అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. తనతో సినిమా చేసిన ఒక దర్శకుడితోనే ఆమె ఏడడుగులు వేశారు.
టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత 'అష్టా చమ్మా', 'స్వామిరారా', 'కార్తికేయ' వంటి విభిన్నమైన సినిమాలతో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కథానాయికగా మెప్పించారు స్వాతి. కొంత విరామం తర్వాత ఆమె తెలుగులో నటించిన ఫీల్ గుడ్ మూవీ 'మంత్ ఆఫ్ మధు'. సరిగ్గా ఇదే సినిమా ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపుగా మారింది.
ఈ చిత్ర దర్శకుడైన శ్రీకాంత్ నాగోతితో స్వాతి ప్రేమలో పడ్డారు. ఇప్పుడు ఆ ప్రేమే పెళ్లి పీటల వరకు చేరింది. దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని ఆమె వైవాహిక బంధంలోకి ఆహ్వానించారు.
గతంలో వికాస్ వాసు అనే పైలట్‌తో స్వాతికి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, మనస్పర్థల కారణంగా కొంతకాలం క్రితమే ఈ ఇద్దరూ విడిపోయారు. ఆ చేదు జ్ఞాపకాలను వెనక్కి నెట్టేసి, ఇప్పుడు శ్రీకాంత్‌తో కలిసి తన లైఫ్‌ను కొత్తగా రీస్టార్ట్ చేశారు స్వాతి.
తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని, దానికి సంబంధించిన అందమైన ఫోటోలను స్వాతి స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. దాంతో ఈ కొత్త జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు మరియు సన్నిహితుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

