RGV’s Satirical: వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై ఆయన తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం జీసస్, అల్లా మధ్య జరిగే ఫైట్ లాంటిది. ఇందులోఎవరు గెలిస్తే ఆ మతంలోకి నేను మారిపోతా' అంటూ ట్వీట్ చేశారు. అమెరికాలో మెజార్టీ క్రిస్టియన్లు ఉండటం,ఇరాన్ ఇస్లామిక్ కంట్రీ కావడంతో ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరు అన్నట్లుగా వర్మ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన వ్యాఖ్యను తీవ్రంగా విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం తన స్టైల్లోనే స్పందించారని అభిప్రాయపడుతున్నారు.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story