Rishab Shetty: కాంతార సినిమాతో గ్లోబల్ రేంజ్‌లో సంచలన విజయం అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నర్ రిషబ్ శెట్టి తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్స్ ఇచ్చాడు. ప్రస్తుతం తను చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టుల గురించిన పూర్తి క్లారిటీని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. రాబోయే రోజుల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోయే రిషబ్ శెట్టి లైనప్ విశేషాలు ఇవే..

కాంతార: చాప్టర్ 2

దర్శకత్వంపై తనకున్న ఇష్టాన్ని చెప్తూ, కాంతార ఫ్రాంచైజీ తదుపరి భాగంపై రిషబ్ కీలక ప్రకటన చేశాడు. "నాకు డైరెక్షన్ చేయకపోతే మనశ్శాంతి ఉండదు. ప్రస్తుతం నా రైటర్స్ టీమ్‌తో కలిసి కాంతార: చాప్టర్ 2 స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాను" అని వెల్లడించాడు.

బ్యాక్ టు బ్యాక్ రెండు క్రేజీ ప్రాజెక్టులు

తాను నటించబోయే రెండు పెద్ద సినిమాల గురించి రిషబ్ క్లారిటీ ఇచ్చాడు. ఒకేసారి రెండు సినిమాలు చేయడం కుదరదు కాబట్టి క్రమపద్ధతిలో షూటింగ్స్ ప్లాన్ చేసుకున్నట్లు చెప్పాడు.

జై హనుమాన్ :

మొదటి ప్రాధాన్యత.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాను రిషబ్ మొదట పూర్తి చేయనున్నాడు.

ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్: తదుపరి చిత్రం.

జై హనుమాన్ పూర్తయిన తర్వాతే చారిత్రాత్మక నేపథ్యంతో రాబోయే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ రెండు చిత్రాల కోసం రిషబ్ పూర్తిగా భిన్నమైన మేకోవర్లలో కనిపించనున్నాడు.

వివేక్ ఒబెరాయ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..

రిషబ్ బర్త్‌డే సందర్భంగా ది ప్రైడ్ ఆఫ్ భారత్ సినిమాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. "రిషబ్ శెట్టి సినిమా ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే పోర్టల్ లాంటిది. మట్టి, నిప్పు, హద్దులు దాటిన నీ విజన్‌తో నువ్వు సినిమా రూల్స్‌నే మార్చేశావు బ్రదర్. నీతో కలిసి త్వరలోనే ఒక ఎపిక్ వండర్‌ను క్రియేట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాను." ట్వీట్ చేశారు..

PolitEnt Media

PolitEnt Media

Next Story