రితికా నాయక్

Ritika Nayak: ‘మిరాయ్’, ‘కొరియన్ కనకరాజు’ సినిమాలతో వరుసగా విజయాలు అందుకున్న హీరోయిన్ రితికా నాయక్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘పవర్‌పేట’ సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. రితికా నాయక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆమెను ‘పదమటి వీధి జానకి’గా పరిచయం చేశారు.
70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి కథ రాయడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కిషన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి సందీప్ కిషన్ పాత్రను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన ‘సేనాపతి రవి’గా కనిపించాడు. ప్రేమ, గౌరవం, రాజకీయాల చుట్టూ సాగే కథను ఈ గ్లింప్స్ ద్వారా చూపించారు. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
తాజాగా విడుదలైన రితికా నాయక్ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆమె చాలా అందంగా, సంప్రదాయ లుక్‌లో కనిపించింది. పాతకాలం నాటి ఇంటి వాతావరణంలో చెక్క బెంచ్‌పై కూర్చొని ఉన్నట్లు పోస్టర్‌ను డిజైన్ చేశారు. క్రీమ్ కలర్ హాఫ్ సారీ, పీచ్ కలర్ దుపట్టా, సంప్రదాయ ఆభరణాలతో రితికా చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తోంది.
అంతేకాదు, రితికా పాత్రలోని విభిన్న కోణాలను చూపిస్తూ మేకర్స్ ఓ స్పెషల్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో ఆమెను రకరకాల లుక్స్‌లో చూపించారు. సంప్రదాయమైన లుక్ నుంచి మోడ్రన్ స్టైల్ వరకు ఆమె కనిపించింది. ముఖ్యంగా ఓవర్సైజ్డ్ షర్ట్‌లో రితికా కనిపించిన లుక్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. అయితే ఆమె పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం గ్లింప్స్‌లో వెల్లడించకుండా ఆసక్తిని కొనసాగించారు.
దర్శకుడు కృష్ణ చైతన్య ‘పవర్‌పేట’ను తన కెరీర్లోనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది. దీంతో ‘పవర్‌పేట’పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

