Yash’s Toxic: రాకింగ్ స్టార్ యశ్ టాక్సిక్.. ట్రైలర్ లాంచ్‌కు గ్రాండ్ ప్లాన్.. ముంబై వేదికగా బిగ్ ఈవెంట్..
ముంబై వేదికగా బిగ్ ఈవెంట్..

Yash’s Toxic: కేజీయఫ్ సిరీస్ సునామీ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం టాక్సిక్. జాతీయ అవార్డు గ్రహీత, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ వయలెంట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాపై ప్రపంచవ్యాప్తంగా అపారమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ విడుదల వేడుకకు చిత్ర యూనిట్ భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తోంది.
బెంగళూరులో గ్రాండ్ ట్రైలర్ ఈవెంట్:
టాక్సిక్ ట్రైలర్‌ను అత్యంత వేడుకగా ఆవిష్కరించేందుకు చిత్రబృందం బెంగళూరులో ఒక భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సినిమాలో యశ్ రాయా అనే గ్యాంగ్‌స్టర్, యాంటీ-హీరో పాత్రలో కనిపించనుండగా, కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే విశేష ఆదరణ పొందిన సాంగ్స్ - గ్లింప్స్:
సినిమా నుంచి ఆమధ్య విడుదలైన తబాహి, మనసాగదే పాటలు మరియు గ్లింప్స్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచాయి. యశ్ రా అండ్ రస్టిక్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్ స్వంత బ్యానర్ మ్యాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'టాక్సిక్' ట్రైలర్ డేట్‌తో పాటు థియేట్రికల్ రిలీజ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.

