పరమ్ సుందరీ ట్రైలర్

Param Sundari: బాలీవుడ్‌లో సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పరమ్ సుందరీ' ట్రైలర్ విడుదలైంది. దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా కథనం నార్త్, సౌత్ కల్చర్ల మధ్య జరిగే ప్రేమ కథగా రూపొందించారు. ఢిల్లీ నుంచి కేరళ వెళ్లిన పరాన్ (సిద్ధార్థ్ మల్హోత్రా), అక్కడ సుందరి (జాన్వీ కపూర్)ని కలుసుకోవడం, వారి మధ్య ప్రేమ ఎలా మొదలయ్యిందనేది ప్రధానాంశం. ట్రైలర్ చూస్తుంటే, ఇందులో కామెడీ, రొమాన్స్, అలాగే రెండు వేర్వేరు సంస్కృతుల మధ్య జరిగే సరదా సంఘటనలు ఉంటాయని అర్థమవుతోంది. ఇది ఒక రొమాంటిక్ కామెడీ సినిమా అని స్పష్టంగా తెలుస్తోంది.

సినిమాను కేరళలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించినట్లు ట్రైలర్‌లో చూపించారు. ఈ విజువల్స్ సినిమాకు మరింత అట్రాక్టివ్ గా ఉన్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలలో నటించగా, రాజీవ్ ఖండేల్వాల్, ఆకాష్ దహియా వంటి నటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ వస్తోంది. కొందరు ఈ కథాంశం పాత చింతకాయ పచ్చడిలా ఉందని.. మరికొందరు సిద్ధార్థ్, జాన్వీల మధ్య ఉన్న కెమిస్ట్రీ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ సినిమా రొమాంటిక్ కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story