హీరోయిన్‌ గా రుక్మిణీ వసంత్‌

Rukmini Vasanth: ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్‌ నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 'మదరాసి' సినిమా నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ విషయాన్ని ఒక ఈవెంట్‌లో ధృవీకరించారు. ఆమె 'కాంతార 2', 'టాక్సిక్' వంటి భారీ ప్రాజెక్టులతో పాటు ఈ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తున్నారని ఆయన తెలిపారు. 'సప్త సాగరాలు దాటి' సినిమాతో రుక్మిణి వసంత్‌కు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ వంటి స్టార్ కాంబినేషన్‌లో నటిస్తుండటంతో ఆమె కెరీర్ మరింత ఊపందుకుంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ‘కేజీయఫ్‌’, ‘సలార్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలతో అలరించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel), మాస్‌ హీరో ఎన్టీఆర్‌ కాంబినేషన్‌ రానున్న చిత్రం కావడంతో ‘డ్రాగన్‌’పై అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే కర్ణాటకలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ ప్రారంభించనున్నారట. ఇక ఇందులో బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్ కూడా కీలకపాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story