మళ్లీ డైరెక్షన్

S. J. Surya: ఒకప్పుడు దర్శకుడిగా పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన ఎస్ జె. సూర్య.. ప్రస్తుతం నటుడిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇంత బిజీలోనూ మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. పదేళ్ల విరామం తర్వాత ఆయన తెరకెక్కించ బోయే ఈ పాన్ ఇండియా మూవీని శుక్రవారం అనౌన్స్ చేశారు.కిల్లర్ టైటిల్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు రివీల్ చేశారు. ఈ చిత్రానికి తానే కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందిస్తూ, హీరోగా నటిస్తున్నాడు ఎస్ జె. సూర్య.

శుక్రవారం పూజా కార్య క్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కాగా హీరో కార్తి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సహా పలువురు సినీ సెలబ్రిటీస్ హాజరై టీమ్కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్, గోకులం మూవీస్ బ్యానర్పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. దక్షిణాదిన పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గోకులం మూవీస్, ఈ సినిమాతో కోలీవుడ్కు కం బ్యాక్ ఇస్తోంది. ప్రీతి ఆస్రాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story