రూ. 700 కోట్ల రిస్క్! భారీ డీల్స్ కోసం రాజీపడని జక్కన్న.

S. S. Rajamouli’s ‘Varanasi’: రాజమౌళి గత చిత్రం 'RRR' ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూలు చేయడమే కాకుండా ఆస్కార్‌ను కూడా గెలుచుకుంది. అందుకే 'వారణాసి'పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. కానీ, ప్రస్తుత సినిమా మార్కెట్ పరిస్థితి గతంలోలా లేదు. ఓటీటీ (OTT) మార్కెట్ నెమ్మదించడం, థియేటర్ల వద్ద కలెక్షన్ల గ్యారెంటీ తగ్గడం వంటి అంశాలు రాజమౌళి సినిమాకు కూడా సవాలుగా మారాయి.

వ్యాపార లెక్కలు ఇలా ఉన్నాయి:

ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇండియాలో కనీసం రూ. 1000 కోట్ల థియేట్రికల్ వసూళ్లు, నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా మరో రూ. 300 కోట్లు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వంటి సంస్థలతో డిజిటల్ హక్కుల కోసం చర్చలు జరుగుతున్నాయి. రాజమౌళి ఈ హక్కుల కోసం రూ. 300 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ హక్కుల విషయానికి వస్తే, ఫార్స్ ఫిల్మ్స్ సంస్థ దాదాపు రూ. 160 కోట్లకు కోట్ చేసినట్లు తెలుస్తోంది.

టికెట్ ధరల తలనొప్పి:

ఈ మధ్య కాలంలో టికెట్ ధరలు భారీగా పెంచిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ కాలం నిలబడలేకపోతున్నాయి. దీనికి విరుద్ధంగా 'ధురంధర్' వంటి సినిమాలు సాధారణ ధరలతోనే రికార్డులు సృష్టించాయి. మరి 'వారణాసి' విషయంలో రాజమౌళి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ధరలు పెంచితే పెట్టుబడి త్వరగా రికవరీ అవుతుంది కానీ, లాంగ్ రన్ దెబ్బతినే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం, తదుపరి కీలక సన్నివేశాల కోసం అంటార్కిటికా వెళ్ళబోతోంది. ఈ సినిమా 2026, ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story