Sai Durgha Tej: సాయి దుర్గా తేజ్ నయా అడ్వెంచర్.. కొత్త సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్..
కొత్త సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్..

Sai Durgha Tej: సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ తన కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల క సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకులు సుజీత్, సందీప్‌ల కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. SDT 19 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ప్రకటన సందర్భంగా చిత్ర యూనిట్ వదిలిన క్యాప్షన్ సినీ ప్రియుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. “యుగాలుగా బయటకు రాని రహస్యాలు.. ఊహకు అందని శక్తులు.. అత్యంత శక్తిమంతమైన ప్రయాణమిది” అంటూ సినిమా థీమ్‌పై హింట్ ఇచ్చారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు, టైటిల్‌ను వెల్లడించనున్నారు.
ఎస్.వై.జి షూటింగ్‌లో బిజీ
ప్రస్తుతం సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు చిత్రంతో బిజీగా ఉన్నారు. రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి తేజ్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బ్రో సినిమా తర్వాత తాను అనుకున్న రెండు సినిమాలు అనివార్య కారణాల వల్ల ఆగిపోయాయని ఆయన తెలిపారు. ఆ తర్వాత వచ్చిన ఈ సినిమా కోసం తన సర్వస్వం ధారపోసి కష్టపడుతున్నట్లు చెప్పారు. ఒక అద్భుతమైన టీమ్‌తో చేస్తున్న ఈ సినిమా తన కెరీర్‌లోనే మైలురాయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

