సాయి దుర్గ తేజ్

Sai Durgha Tej: హీరో సుహాస్, శివానీ నగరం ప్రధాన పాత్రల్లో నటించిన 'హే భగవాన్' సినిమాకు సంబంధించిన 'నాట్ ఏ ట్రైలర్' (Not a Trailer) లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయి దుర్గ తేజ్ (సాయి ధరమ్ తేజ్) చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నేను ఇటీవల ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశాను. సినిమా చూస్తున్నంత సేపు చాలా బాగా నవ్వుకున్నాను. నా సినిమా కాకుండా వేరే సినిమా చూసి నేను ఇంతగా నవ్వానంటే, ఆ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని నా నమ్మకం."సుహాస్ చాలా కష్టపడి పైకి వచ్చిన నటుడు. అతను కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా తన ప్రతిభను చాటుకుంటున్నాడు. ఒక చిన్న స్థాయి నుంచి ఇక్కడి వరకు రావడం గొప్ప విషయం."

సుహాస్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు అతని తల్లిదండ్రులను ఒప్పించడంలో సాయి తేజ్ కూడా సహాయం చేశారట. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ సుహాస్‌కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.సాయి

ఈ ప్రాజెక్ట్‌లో మొదటి నుంచి పాలుపంచుకున్న నిర్మాత వంశీ నందిపాటిని అభినందిస్తూ, సినిమాపై ఆయనకున్న పట్టును కొనియాడారు. 'హే భగవాన్' చిత్రం ఫిబ్రవరి 20న విడుదలవుతున్న నేపథ్యంలో, ఈ సినిమా టీమ్ అందరికీ పెద్ద విజయం దక్కాలని ఆయన ఆకాంక్షించారు.తేజ్ తనకు అన్నలాంటి వారని, తన ప్రతి సినిమాకు సపోర్ట్ చేస్తారని సుహాస్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈవెంట్‌లో సీనియర్ నటుడు నరేష్ ఈ వేడుకలో తనదైన శైలిలో ఫన్నీగా మాట్లాడారు. 'హ్యాపీ హగ్ డే' సందర్భంగా స్టేజ్ మీద ఉన్న మగవారందరికీ హగ్ ఇచ్చి, హీరోయిన్ శివానీ నగరం దగ్గరకు వచ్చేసరికి "భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్లు ఆడవాళ్లను హగ్ చేసుకోకూడదు" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story