Kalaimamani Awards: సాయి పల్లవి, ఎస్.జే.సూర్య, విక్రమ్ ప్రభు, అనిరుధ్‌లకు తమిళనాడు కలైమామణి అవార్డులు
తమిళనాడు కలైమామణి అవార్డులు

Kalaimamani Awards: తమిళనాడు ప్రభుత్వం అందించే అత్యున్నత కలైమామణి అవార్డుల ప్రకటన ఎట్టకేలకు వెలువడింది. సినిమా, టీవీ, సంగీతం, సాహిత్యం, నాటక రంగాలలో విశేష కృషి చేసిన కళాకారులకు ఈ అవార్డులను ప్రతి సంవత్సరం అందజేస్తారు. 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన కలైమామణి, భారతీయార్, ఎంఎస్ సుబ్బులక్ష్మి, బాలసరస్వతి అవార్డుల గ్రహీతలను తమిళనాడు రాష్ట్ర సంగీత సాహిత్య నాటక అకాడమీ (తమిళ నాడు ఇయల్ ఇసై నాటక మండ్రం) బుధవారం ప్రకటించింది.
ఈ అవార్డులను వచ్చే నెలలో ముఖ్యమంత్రి ఎం�.కే. స్టాలిన్ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. గత మూడేళ్లుగా ఈ అవార్డుల ప్రకటన ఆలస్యం కాగా, సినీ ప్రముఖులు సీఎం స్టాలిన్‌ను కలిసి పలుమార్లు వినతి చేయడంతో ఈసారి మూడేళ్ల అవార్డులను ఒకేసారి ప్రకటించారు.
కలైమామణి అవార్డు గ్రహీతలకు 3 సవర్ల బంగారు పతకం, జ్ఞాపిక అందజేస్తారు. అలాగే, భారతీయార్ (సాహిత్యం), ఎంఎస్ సుబ్బులక్ష్మి (సంగీతం), బాలసరస్వతి (నాటకం) పేర్లతో ప్రత్యేక అవార్డులను ప్రదానం చేస్తారు. భారతీయార్ అవార్డును నమురుగేశ పాండియన్, ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డును పద్మభూషణ్ డాక్టర్ కేజే ఏసుదాస్, బాలసరస్వతి అవార్డును పద్మశ్రీ ముత్తు కన్నమ్మాళ్లకు అందజేయనున్నారు. వీరికి లక్ష రూపాయల నగదు, 3 సవర్ల బంగారు పతకం బహూకరిస్తారు.
కలైమామణి అవార్డు గ్రహీతలు:
2021 సంవత్సరం:
సాయి పల్లవి (సినిమా - నటి)
ఎస్.జే. సూర్య (సినిమా - నటుడు)
పూచ్చి మురుగన్ (నాటకం)
లింగుస్వామి (సినీ దర్శకుడు)
సూపర్ సుబ్బరాయన్ (స్టంట్ మాస్టర్)
బీకే కమలేష్ (బుల్లితెర నటుడు)
ఎంపి విశ్వనాథన్ (సంగీతం, నాటక నటుడు)
2022 సంవత్సరం:
విక్రమ్ ప్రభు (సినిమా - నటుడు)
జయ వీసీ గుహనాథన్ (సినీ నటి)
వివేకా (సినీ గేయ రచయిత)
డైమండ్ బాబు (సినీ పీఆర్వో)
టి. లక్ష్మీనాథన్ (సినీ ఫొటోగ్రాఫర్)
గాయత్రి (బుల్లితెర నటి)
2023 సంవత్సరం:
అనిరుధ్ రవిచందర్ (సినీ సంగీత దర్శకుడు)
శ్వేతా మోహన్ (నేపథ్య గాయని)
సంతోష్ కుమార్ (సాండీ) (కొరియోగ్రాఫర్)
నిఖిల్ మురుగన్ (సినీ పీఆర్వో)
ఉమా శంకర్ (టీవీ యాంకర్)
