Sai Pallavi to Join ‘Kalki 2’: కల్కి 2లోకి సాయి పల్లవి.. నవంబర్లో షూటింగ్?
షూటింగ్?

Sai Pallavi to Join ‘Kalki 2’: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, పాపులర్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘కల్కి 2’ రానున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ప్రారంభమైనట్లు వార్తలు వచ్చినా, ప్రభాస్ అందుబాటులో లేకపోవడంతో కొంతకాలం వాయిదా పడింది. ఇప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ మళ్లీ షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల చివర్లో చిత్రీకరణ తిరిగి మొదలయ్యే అవకాశముందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, మొదటి భాగంలో సుమతిగా నటించిన దీపికా పదుకొణె సీక్వెల్‌లో కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఆమె స్థానంలో సాయి పల్లవిని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె నవంబర్ 2026లో షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం.
అయితే, సాయి పల్లవి పాత్రపై ఇంకా స్పష్టత రాలేదు. ఆమె దీపికా పదుకొణె పోషించిన సుమతి పాత్రలోనే కనిపిస్తారా? లేక కొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వస్తేనే దీనిపై స్పష్టత రానుంది.

