Salman Khan: అర్ధరాత్రి సిక్స్‌ప్యాక్ పిక్‌తో సల్మాన్ రచ్చ... ట్రోలర్స్‌కు కండల వీరుడి ఊరమాస్ కౌంటర్..
కండల వీరుడి ఊరమాస్ కౌంటర్..

Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో తనదైన శైలిలో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల తన ఫిట్‌నెస్, ఆరోగ్యంపై కొందరు నెటిజన్లు చేసిన విమర్శలకు, ట్రోల్స్‌కు గట్టి సమాధానమిస్తూ అర్థరాత్రి వేళ జిమ్‌లో దిగిన రెండు పవర్‌ఫుల్ షర్ట్‌లెస్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. తీవ్రమైన వర్కౌట్ తర్వాత తీసిన ఈ పిక్స్‌లో ఆయన తన సిక్స్‌ప్యాక్ అబ్స్, పర్ఫెక్ట్ ఫిజిక్‌ను ప్రదర్శిస్తూ అభిమానులను అలరించారు.
భయపడేవాడు చనిపోయినట్లే:
ఈ ఫోటోలతో పాటు సల్మాన్ జోడించిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. సల్మాన్ ఖాన్ భయపడ్డాడా.. భయపడేవాడు చనిపోయినట్టే అనే పవర్‌ఫుల్ డైలాగ్‌ను ఆయన పోస్ట్ చేశారు.
తనపై నిరంతరం విమర్శలు గుప్పించే ట్రోలర్లకు ఇది పరోక్షంగా ఇచ్చిన ఊరమాస్ కౌంటర్ అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అంతేకాకుండా ఇటీవల ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా సల్మాన్ చేసిన పోస్టులపై వచ్చిన విమర్శలకు కూడా ఈ ఫోటో ద్వారానే ఆయన సమాధానం చెప్పారని విశ్లేషకులు భావిస్తున్నారు.
రూమర్లకు చెక్ పెట్టిన భాయిజాన్
కొద్దిరోజుల క్రితం ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌లో సల్మాన్ లుక్ చూసి ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. అభిమానులు కొంత ఆందోళన వ్యక్తం చేయగా, కొందరు నెటిజన్లు ఆయన వయస్సు, ఫిట్‌నెస్‌పై ట్రోలింగ్ ప్రారంభించారు. అయితే, తాజా జిమ్ ఫొటోలతో తాను ఇప్పటికీ అంతే ఫిట్‌గా, స్ట్రాంగ్‌గా ఉన్నానని సల్మాన్ క్లారిటీ ఇచ్చేశారు.
వరస ప్రాజెక్టులతో బిజీ బిజీ
ఇక సల్మాన్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్ అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. 2020లో చోటుచేసుకున్న గల్వాన్ లోయ ఘర్షణల నేపధ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ట్రోల్స్ ఎన్ని వచ్చినా తన పనితోనే సమాధానం చెప్తానని సల్మాన్ ఖాన్ ఈ కొత్త పిక్స్‌తో మరోసారి నిరూపించారు.

