Samantha: డైరెక్టర్ తో విదేశాల్లో.. ఫోటోలతో రచ్చలేపిన సమంత
ఫోటోలతో రచ్చలేపిన సమంత
Samantha: ది ఫ్యామిలీ మెన్ 2 డైరెక్టర్ రాజ్ నిడిమోరు, నటి సమంత గురించి కొంతకాలంగా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల తరచూ కలిసి కనిపించడంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
లేటెస్ట్ గా అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో పర్యటించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. వీటిలో రాజ్‌తో దిగిన చిత్రాలు కూడా ఉండడంతో అవి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు సమంత గానీ, రాజ్‌గానీ ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం. గతంలో వీరిద్దరు దుబాయ్‌లో పర్యటించారు.
ఇటీవల సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక కొన్ని రోజులు తనపై వస్తోన్న వార్తల నేపథ్యంలో సమంత ఇటీవల తన ఇన్‌స్టాలో ఓ సందేశాత్మక పోస్ట్ పంచుకున్న విషయం తెలిసిందే. ‘‘ఇతరుల మాటలను పట్టించుకోకుండా నిబ్బరంగా ఉండేందుకు ప్రయత్నించండి అంటూ సూచించింది.
