దర్శకుడి భార్య పోస్ట్‌ వైరల్

Samantha-Raj Controversy: స్టార్ హీరోయిన్ సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. సమంత తన దుబాయ్ పర్యటనకు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటలకే, రాజ్ నిడిమోరు భార్య శ్యామలీ దే సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.

దుబాయ్ వీడియోతో మొదలైన చర్చ

సమంత ఇటీవల తన దుబాయ్ ట్రిప్‌కు సంబంధించిన ఒక రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి చేయి పట్టుకుని నడుస్తున్న దృశ్యం ఉంది. ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించనప్పటికీ, ఆయన రాజ్ నిడిమోరు అని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే, వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై పుకార్లు మరోసారి ఊపందుకున్నాయి.

'విరక్తి' గురించి రాజ్ నిడిమోరు భార్య పోస్ట్

సమంత వీడియో బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే, రాజ్ నిడిమోరు భార్య శ్యామలీ దే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'విరక్తి' గురించి ఒక పోస్ట్ పెట్టారు. "విరక్తి అంటే.. నీ దగ్గర ఏమీ ఉండకూడదని కాదు. ఏదీ నిన్ను సొంతం చేసుకోకూడదు అనేదే అసలైన విరక్తి" అంటూ అలీ ఇబ్న్ అబీ తాలిబ్ కొటేషన్‌ను ఆమె పంచుకున్నారు. సమంత వీడియోకు, శ్యామలీ దే పోస్ట్‌కు ఉన్న సమయం ఈ రెండింటినీ ముడిపెడుతూ నెటిజన్లు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు.

గతంలో కూడా సమంత, రాజ్ నిడిమోరుల సన్నిహిత ఫొటోలు బయటకు వచ్చినప్పుడు, శ్యామలీ దే.. కర్మ, ధర్మం వంటి అంశాలపై పోస్టులు పెట్టారు. దీంతో ఈసారి కూడా ఆమె పోస్ట్ పరోక్షంగా ఈ వ్యవహారానికి సంబంధించినదేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story