Samantha Ruth Prabhu: డబ్బింగ్ మొదలుపెట్టిన సమంత.. 'మా ఇంటి బంగారం'పై ఎమోషనల్ పోస్ట్.
'మా ఇంటి బంగారం'పై ఎమోషనల్ పోస్ట్.

Samantha Ruth Prabhu: సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ "మా ఇంటి బంగారం" విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. తన పునరాగమనాన్ని (కమ్ బ్యాక్) చాటిచెప్పే ఈ సినిమా కోసం సమంత స్వయంగా తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు.
డబ్బింగ్ స్టూడియో నుంచి ఒక ఫోటోను షేర్ చేసిన సమంత, ఈ ప్రాజెక్ట్‌తో తనకున్న ఎమోషనల్ బాండింగ్‌ను పంచుకున్నారు. తన కెరీర్‌లోనే ఇది తనకు అత్యంత ఇష్టమైన సినిమా అని చెబుతూ.. "#MIB నా ఫేవరెట్ ఫిల్మ్" అని ఎంతో ఎగ్జైటింగ్‌గా రాసుకొచ్చారు.
గతంలో 'ఓ బేబీ' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన నందినీ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను సమంత తన స్వంత బ్యానర్‌పై నిర్మిస్తుండటం విశేషం. ప్రముఖ మేకర్ రాజ్ నిడిమోరు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉన్నారు.
సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. మేకర్స్ ఈ చిత్రాన్ని మే 15న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొంచెం గ్యాప్ తర్వాత సమంత పూర్తిస్థాయిలో సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తుండటంతో, ఆమె అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

