Samantha Ruth Prabhu: సామ్ డ్యాన్స్ స్టెప్పులు.. 'తస్సాదియా' సాంగ్ అదిరింది!
'తస్సాదియా' సాంగ్ అదిరింది!

Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' నుంచి మొదటి పాట "తస్సాదియా" విడుదలైంది. ఫ్యామిలీ యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్లను మేకర్స్ ఈ అదిరిపోయే పాటతో షురూ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరపరిచిన ఈ పాట, పెళ్లి వేడుక నేపథ్యంలో సాగే ఒక ఎనర్జిటిక్ నంబర్‌గా అలరిస్తోంది.
ఈ పాటలో సమంత తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టారు. రెహమాన్ అందించిన సాహిత్యం, చిన్మయి శ్రీపాద మరియు పుణ్య సెల్వ గాత్రం ఈ పాటకు మరింత ఊపునిచ్చాయి. ప్రేమ, కుటుంబం మరియు జీవితంలోని సంతోషాలను సెలబ్రేట్ చేసుకునే విధంగా పండగ వాతావరణాన్ని తలపించేలా ఈ పాటను రూపొందించారు.
గతంలో 'ఓ బేబీ' వంటి సూపర్ హిట్ అందించిన దర్శకురాలు నందినీ రెడ్డి, ఈ సినిమాతో మరోసారి సమంతను సరికొత్తగా చూపిస్తున్నారు. రాజ్ నిడిమోరు కథను అందించిన ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, మే 15, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

