ఫాలోవర్ల సాయం

Samantha: సమంత ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్లతో ముచ్చటించారు. ఆ సమయంలో చాలా మంది తల్లులు తమ అనుభవాలను పంచుకుంటూ మాతృత్వంపై సలహాలు ఇచ్చారు. ఈ ఇంటరాక్షన్ సందర్భంగా, తన బిడ్డ రాక కోసం తాను చేస్తున్న ఏర్పాట్ల గురించి కూడా ఈ నటి మాట్లాడారు.
తన బేబీ కోసం ఏమేమి ప్లాన్ చేశారని అడిగినప్పుడు, బిడ్డకు కావలసిన వస్తువులన్నీ ఇప్పటికే కొనుగోలు చేసినట్లు సమంత వెల్లడించారు. అయితే, ఆ బేబీ ప్రొడక్ట్స్ అన్నీ చూస్తుంటే ఆమెకు కొద్దిగా ఆందోళనగా అనిపించిందట. "బేబీకి కావాల్సినవన్నీ కొనేశాను. అవన్నీ చూస్తుంటే నాకు కొంచెం టెన్షన్ పట్టుకుంది, అందుకే ప్రస్తుతానికి అన్నీ ఒక బ్యాగ్‌లో సర్దేసి, ఆ బ్యాగ్‌ను లాప్‌టాప్ స్టాండ్‌లా వాడుతున్నాను" అని ఆమె సరదాగా చెప్పారు.
తల్లి కావడం వల్ల వచ్చే మార్పుల గురించి కూడా సమంతను అడిగారు. బిడ్డకు పాలు పట్టడం, నిద్రపుచ్చడానికి జోలపాటలు పాడటం వంటి మధురమైన క్షణాలను అనుభవించడానికి తాను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపారు.
"ఈ పనులన్నీ ఒక ఫుల్ టైమ్ జాబ్ లాగా మారుతాయి. ఇది ఎంతో అందమైన, అద్భుతమైన, జీవితాన్నే మార్చేసే అనుభవం" అని సమంత చెప్పారు.
మాతృత్వం అనేది ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని ఒక ఫాలోవర్ చెప్పినప్పుడు, తాను ఆ కోణంలో ఎప్పుడూ ఆలోచించలేదని సమంత అంగీకరించారు. "మాతృత్వం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని నాకు తెలీదు. నేను అసలు ఊహించనే లేదు. మీరు నాకు చాలా మంచి విషయం చెప్పారు. థాంక్యూ" అని ఆమె బదులిచ్చారు.
అన్నింటికంటే చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే.. మీ బిడ్డకు ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు అని ఒక ఫాలోవర్ అడగడం. పేరు పెట్టడం చాలా కష్టంగా ఉందని ఒప్పుకున్న సమంత, ఈ విషయంలో తన ఫాలోవర్ల సహాయం కోరారు.
"పేరు వెతకడం చాలా కష్టమైన పని. దీనికోసమే మీ అందరి సాయం నాకు కావాలి" అని ఆమె కోరారు.
సమంత ఇచ్చిన ఈ సమాధానంతో ఆమె అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. సమంత తన బిడ్డకు చివరికి ఏ పేరు పెడుతుందా అని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

