Samantha: సమంత కొత్త అవతారం..? మెగాఫోన్ పట్టుకోనున్న స్టార్ హీరోయిన్!
మెగాఫోన్ పట్టుకోనున్న స్టార్ హీరోయిన్!

Samantha: స్టార్ హీరోయిన్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సమంత, ఇప్పుడు తన కెరీర్‌లో మరో కొత్త అడుగు వేయబోతున్నారనే వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. నటిగా, నిర్మాతగా తనను తాను నిరూపించుకున్న ఆమె, త్వరలోనే దర్శకురాలిగా మెగాఫోన్ పట్టనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సమంత స్వయంగా ఓ అందమైన ప్రేమకథను సిద్ధం చేసుకున్నారట. ఈ కథతోనే ఆమె దర్శకత్వంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది యువ నటీనటులతో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు కూడా జరిపినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని కూడా ఆమె తన సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కించాలని భావిస్తున్నట్లు సమాచారం.
మూడు విభాగాల్లో ప్రతిభ
ఇటీవలే ‘శుభం’ అనే హారర్-కామెడీ చిత్రంతో సమంత నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టి.. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా మూడు కీలక విభాగాల్లో తన ప్రతిభను చాటబోతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ వంటి వెబ్ సిరీస్‌లతో జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు అందుకున్న సమంత, దర్శకురాలిగా ఏ మేరకు రాణిస్తారో చూడాలని ఆమె అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
