కొత్త సందడి

Samantha: ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మళ్లీ బుల్లితెరపై మెరిసేందుకు సిద్ధమయ్యారు. సోనీ టీవీ ప్రసారం చేయనున్న ప్రతిష్టాత్మక 'సెలబ్రిటీ మాస్టర్‌షెఫ్ తమిళ'వంటల రియాలిటీ షోకి ఆమె వ్యాఖ్యాతగా (హోస్ట్) వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని సోనీ టీవీ అధికారికంగా ప్రకటించింది.
బానిజే ఆసియా సంస్థ నిర్మిస్తున్న ఈ షో, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మాస్టర్‌షెఫ్ ఫార్మాట్‌ను తమిళ ప్రేక్షకులకు అనుగుణంగా సరికొత్తగా అందిస్తోంది. ఇందులో పలువురు ప్రముఖ తమిళ సినీ, బుల్లితెర సెలబ్రిటీలు పాల్గొని తమ వంటల నైపుణ్యంతో పోటీ పడనున్నారు. ఈ కార్యక్రమం సోనీ విళా వినోద విభాగంలో భాగముగా ప్రసారమవ్వడమే కాకుండా, సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కూడా స్ట్రీమింగ్ కానుంది. ప్రేక్షకులను అలరించేందుకు సెలబ్రిటీల కిచెన్ ప్రయాణానికి సంబంధించిన ప్రత్యేక షార్ట్ వీడియోలను కూడా డిజిటల్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ఈ కొత్త బాధ్యతపై సమంత స్పందిస్తూ తీవ్ర ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఆహారం అనేది మనుషులను దగ్గర చేయడమే కాకుండా, కెమెరా ముందు సాధారణంగా కనిపించని నటుల సరికొత్త కోణాన్ని బయటకు తీస్తుందని, అందుకే ఈ షో చేయడానికి ఒప్పుకున్నానని చెప్పారు. అయితే షోలో పాల్గొనే సెలబ్రిటీ పోటీదారులు ఎవరనేది ఇప్పుడు చెప్పలేనని, వారు కిచెన్‌లో చేసే ప్రయోగాలు, పడే కష్టాలు చూడటానికి తాను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. భారతీయ సినిమాలో అగ్రనటిగా గుర్తింపు తెచ్చుకున్న సమంత, ఈ షోతో బుల్లితెరపై సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు.
- SamanthaSamanthaRuthPrabhuSamanthaNewsCelebrityMasterChefTamilMasterChefTamilSamanthaTVEntrySamanthaTelevisionSmallScreenTelevisionDebutTVHostCelebrityMasterChefTamilTelevisionTamilTVSonyVIZHASonyLIVBanijayAsiaSamanthaFansTollywoodSouthIndianCinemaIndianCinemaCelebrityNewsEntertainmentNewsTelevisionNewsTVNewsMovieNewsLatestEntertainmentNewsLatestTVNewsLatestTeluguNewsTeluguNewsBreakingNewsLatestNews

