Samantha: సామ్ పచ్చబొట్టు చెదిరిపోలేదు.. ఫిక్స్ వైరల్
ఫిక్స్ వైరల్

Samantha: పచ్చబొట్టు చెరిగే పోదులే నా రాజా.. పడుచు జంట చెదిరిపోదులే.. అన్నారో సినీ కవి. పడుచు జంట చెదిరి పోయినా పచ్చబొట్టు చెదిరిపోలేదు ఇక్కడ. స్టార్ హీరోయిన్ సమంత తొలి సినిమా ఏం మాయ చేశావె. ఈ సినిమా సమంతకు చాలా అనుభూతుల్ని, అనుభవాల్ని ఇచ్చింది. ఆ సినిమా పేరును తన మెడపై వైఎంసీ అని పచ్చబొ ట్టు వేయించుకుంది సమంత. ఈ సినిమా సమయంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఆ తరవాత ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు. కొన్నాళ్లకు విడిపోయారు. చై జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా చెరిపివేసుకొంటూ వచ్చింది సామ్. అందులో భాగంగా మెడపై ఉన్న పచ్చబొట్టు కూడా తొలగించిందన్న వార్తలొచ్చాయి. కొన్ని సందర్భాల్లో సమంత మెడపై వైఎంసీ కనిపించ లేదు. దాంతో పచ్చబొట్టు తీయిం చేసిందనుకొన్నారు. సమంత మెడపై మళ్లీ అది ప్రత్యక్షమైంది. దాంతో ఇన్నాళ్లూ ఆ టాటూ కనిపించకుండా సమంత ఏం మాయ చేసిందో? అనే గుసగుసలు మొదలయ్యా యి. అయితే కేవలం తన కెరీర్ కు బూస్టప్ ఇచ్చిన సినిమాగా ఏం మాయ చేశావే గుర్తిండిపోవాలన్న ఉద్దేశం తో సమంత ఈ టాటూని అలానే ఉం చేసుకొని ఉండొచ్చనే టాక్ కూడా ఉంది. సమంత, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం ఏ మాయ చేశావే. ఈ సినిమా సెట్‌లో వారిద్దరూ లవ్‌లో పడ్డారు. సుదీర్ఘకాలంగా ఒకర్నికొరు ప్రేమించుకొన్నారు. ఆ తర్వాత చాలా కాలం డేటింగ్ చేసి.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. అనంతరం ఇరు కుటుంబాలు అంగీకారంతో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకొన్నారు. దాదాపు నాలుగేళ్లు వారి కాపురం సవ్యంగా సాగింది. ఆ తరువాత ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అనంతరం హీరోయిన్ శోభితను నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు.
