Sanjay Kapur: బిజినెస్ ప్రపంచంలో కింగ్ అయినా.. ఆ కల నెరవేరకుండానే కన్నుమూసిన కరిష్మా మాజీ భర్త
ఆ కల నెరవేరకుండానే కన్నుమూసిన కరిష్మా మాజీ భర్త

Sanjay Kapur: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ తన వ్యక్తిగత జీవితంతో ఎంతలా వార్తల్లో నిలిచారో.. ఆయన వ్యాపార సామ్రాజ్యం గురించి కూడా అంతే చర్చ జరిగింది. భారతదేశంలోని ప్రముఖ ఆటో పార్ట్స్ కంపెనీ సోనా కామ్‌స్టార్ కు ఆయన ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆయనకు వ్యాపార ప్రపంచంలో చాలా పేరుంది.. అయితే, అపారమైన సంపద, ఒక పెద్ద కంపెనీకి బాస్ అయినప్పటికీ, ఆయనకు ఒక కల ఉండేది. అది తన జీవిత చివరి క్షణం వరకు నెరవేరలేదని తెలుస్తోంది.
సంజయ్ కపూర్ సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్, అంటే సోనా కామ్‌స్టార్‌కు ఛైర్మన్‌గా పనిచేశారు. దేశంలోని అగ్రశ్రేణి ఆటో-కాంపోనెంట్ కంపెనీలలో ఇది ఒకటి. ఆయన ఈ కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లి దానిని ఒక అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చారు. ముఖ్యంగా ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) రంగంలో కంపెనీ పేరు చాలా వేగంగా దూసుకెళ్లింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా సోనా కామ్‌స్టార్‌కు మంచి గుర్తింపు లభించింది.
బిజినెస్ లో ఇంతటి విజయం సాధించినా సంజయ్ కపూర్‌కు వ్యక్తిగత జీవితంలో మాత్రం అందరూ కోరుకునే ప్రశాంతత లభించలేదు. కరిష్మా కపూర్‌తో ఆయన వివాహం 2003లో జరిగింది. అయితే, వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2016లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ బంధం చాలా కాలం పాటు వివాదాలకు కేంద్రంగా నిలిచింది. మీడియాలో నిత్యం వార్తల్లో ఉండేది. విడాకుల తర్వాత కూడా సంజయ్ కపూర్ పూర్తిగా సాధారణ స్థితికి రాలేకపోయారని చెబుతారు.
మేనేజింగ్ డైరెక్టర్ పదవిని చేపట్టిన తర్వాత సోనా కామ్‌స్టార్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడంలో సంజయ్ కపూర్ కీలక పాత్ర పోషించారు. చైనా, అమెరికా, మెక్సికో, సెర్బియా వంటి దేశాలకు కూడా ఆయన కంపెనీ వ్యాపారాన్ని విస్తరించారు. ఈ దేశాలలో కంపెనీ ఉత్పత్తి, పరిశోధన కేంద్రాలను స్థాపించారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఉన్న అవకాశాలను ఆయన ముందుగానే గుర్తించారు. కంపెనీ తన దృష్టిని ఈవీ రంగంపైకి మార్చారు. ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన ఆటో-పార్ట్స్ ను అందించే ప్రధాన సరఫరాదారుగా సోనా కామ్‌స్టార్‌ను మార్చడమే ఆయన విజన్. అయితే, ఈ కల ఆయన జీవితాంతం పూర్తిగా నెరవేరలేకపోయింది. అయినప్పటికీ, ఈవీ సెగ్మెంట్‌పై ఆయన పెట్టిన ఈ దృష్టి, కంపెనీ భవిష్యత్తుకు ఒక మైలురాయిగా మారింది. ప్రస్తుతం బ్లూమ్‌బర్గ్ ప్రకారం, సోనా కామ్‌స్టార్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.31,000 కోట్లు) గా ఉంది.
