సంయుక్త, అనిరుధ్

Sanyuktha and Anirudh: తమిళ సినీ పరిశ్రమ, క్రికెట్ ప్రపంచం నుంచి వచ్చిన నటి-మోడల్ సంయుక్త షణ్ముగనాథన్, మాజీ క్రికెటర్ అనిరుధ్ శ్రీకాంత్ ఒక్కటయ్యారు. భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కుమారుడు అయిన అనిరుధ్, తమిళ బిగ్‌బాస్ ఫేమ్ సంయుక్తను చెన్నైలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా, సంప్రదాయబద్ధంగా జరిగింది. పెళ్లి తర్వాత నూతన జంట తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తొలి ఫోటోలను పంచుకోవడంతో అవి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

సంయుక్తసంప్రదాయమైన గోల్డ్ కలర్ పట్టు చీర ధరించి, దానికి తగినట్టుగా టెంపుల్ జ్యువెలరీతో మెరిసిపోయింది. అనిరుధ్ పసుపు-బంగారు రంగు కలసిన చొక్కా, పంచె ధరించి సంప్రదాయ లుక్‌లో కనిపించారు. పెళ్లి ఫోటోలలో ఇద్దరూ చిరునవ్వులతో కనిపించారు. ముఖ్యంగా సంయుక్త, అనిరుధ్, సంయుక్త కుమారుడు ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకర్షించాయి. ఈ వివాహంతో తమ బంధంపై నెలకొన్న ఊహాగానాలకు ఈ జంట ముగింపు పలికింది.

సంయుక్త, అనిరుధ్ ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం విశేషం. సంయుక్త గతంలో కార్తీక్ శంకర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. విడాకుల తర్వాత ఆమె కొడుకుతో కలిసి జీవిస్తున్నారు. అనిరుధ్ శ్రీకాంత్ గతంలో మోడల్ ఆర్తి వెంకటేష్‌ను వివాహం చేసుకుని, కొన్నాళ్ల తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో నూతన దంపతులకు సినీ, క్రీడా ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story