స్టెప్పులతో రచ్చ చేసిన కమెడియన్!

Satya Proves He’s Not ‘Jaitley’: శేషాద్రి ప్రసాద్ (సత్య) హీరోగా, దర్శకుడు రితేష్ రాణా కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ 'జెట్లీ'. ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ చిత్ర బృందం తాజాగా 'సత్య ఈజ్ నాట్ జెట్లీ' అనే ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేసింది. సినిమా మూడ్‌కు తగ్గట్టుగా చాలా సరదాగా, విభిన్నంగా ఉన్న ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ప్రముఖ సంగీత దర్శకుడు కాలభైరవ ఈ పాటకు అదిరిపోయే ట్యూన్ అందించగా, సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో పాటలో అదరగొట్టారు. రచయిత సాయి సోమయాజులు రాసిన కొంటె పదాలు, గాయని శ్రావణ భార్గవి గొంతు ఈ పాటకు మంచి జోష్‌ను తీసుకొచ్చాయి. ఈ పాటలో సత్యకు జోడీగా నటిస్తున్న డెబ్యూ హీరోయిన్ రియా సింఘా తన గ్లామర్‌తో పాటు స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది.

క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. గతంలో రితేష్ రాణా - సత్య కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి, అందుకే ఈ 'జెట్లీ' సినిమాపై కూడా భారీ ఆశలే ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story