Satyadev’s Rao Bahadur: ఓటీటీలోకి సత్యదేవ్ రావు బహదూర్.. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Satyadev’s Rao Bahadur: వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ సోషల్ డ్రామా రావు బహదూర్ డిజిటల్ ప్రిమియర్‌కు రంగం సిద్ధమైంది. థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ విలక్షణ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. జులై 31 నుంచి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
5 భాషల్లో ప్రపంచవ్యాప్త స్ట్రీమింగ్..
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో, ప్రశాంత్ కుమార్ డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జులై 31 నుండి అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్ కాబోతోంది. థియేట్రికల్ రిలీజ్ సమయంలో సత్యదేవ్ వైవిధ్యమైన నటనా శైలి, దర్శకుడి స్క్రీన్‌ప్లే, సాంకేతిక విలువలు విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకున్నాయి.
పీరియాడిక్ నేపథ్యంలో సాగే ఉత్కంఠభరిత కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీలోకి వస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో మరింత మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

