Ashu Reddy Case: నటి ఆషు రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఎన్ఆర్ఐ ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానంటూ తొమ్మిది కోట్ల మేర మోసం చేసిన కేసులో ఇప్పుడు ఒక సంచలన ఆడియో వెలుగులోకి వచ్చింది.

ధర్మేంద్రకు ఆషు రెడ్డి పంపిన వాట్సాప్ ఆడియో మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "నీ ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు.. పెద్ద మనుషుల దగ్గర పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించుకుందాం" అంటూ ఆషు రెడ్డి ఆ వాయిస్ నోట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఈ వివాదంలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి పేరు వినిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నీ వైపు నుంచి పంచాయితీకి వేణు స్వామిని తీసుకొస్తావో.. ఇంకెవరిని తీసుకొస్తావో నీ ఇష్టం" అని ఆషు అనడం చర్చకు దారితీస్తోంది. గతంలో వీరికి కామాఖ్య అమ్మవారి ఆలయంలో వేణు స్వామి పూజలు చేయించడం, జాతకాలు చూడటం వంటి విషయాలు ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చాయి.

ఈ ఆడియోలో ఆషు రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆమెకు ఇబ్బందికరంగా మారేలా ఉన్నాయి. మే నెల వరకు సమయం ఇస్తే కోటిన్నర రూపాయలు బ్యాంక్ అకౌంట్ ద్వారా తిరిగి ఇచ్చేస్తానని ఆమె చెప్పారు. అంటే, ధర్మేంద్ర దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని ఈ ఆడియో ద్వారా స్పష్టమవుతోంది. "మిగిలిన డబ్బును జీవితంలో ఎప్పుడైనా సెటిల్ అయ్యాక ఇస్తాను.. అది ఎప్పుడో ఇప్పుడు చెప్పలేను అని ఆమె అనడం గమనార్హం.

తన తరపున సీరియల్ నటి ప్రవీణ పంచాయితీకి వస్తారని చెప్తూనే.. ధర్మేంద్రను ఆషు హెచ్చరించారు. నా అనుమతి లేకుండా ఇంటికి ఎందుకు వస్తావు? నా ఇంట్లో వాళ్ళని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేస్తే కేసు పెడతాను" అంటూ ఆమె బెదిరింపులకు దిగినట్లు ఆడియోలో వినిపిస్తోంది.

మొత్తానికి, పెళ్లి పేరుతో జరిగిన ఈ తొమ్మిది కోట్ల రూపాయల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వేణు స్వామికి ఈ వ్యవహారం ముందే తెలుసా? ఆషు రెడ్డి నిజంగానే మోసం చేసిందా? అన్న కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేసే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story