కొత్త వాళ్లతో షూటింగులు చేస్తామని ప్రకటించిన నిర్మాత మండలి

తెలుగు ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ మధ్య వేతనాల పెంపె విషయంలో ఉత్పన్నమైన వివాదం ముది పాకన పడింది. వేతానాలు పెంచితేనే కానీ షూటింగులకు హాజరు కామని ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ తెగేసి చెప్పింది. తమను కాదని ముంబయ్‌ నుంచి టెక్నీషియన్లను తెప్పించి ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా షూటింగ్‌ నిర్వహిస్తుంటే పెద్ద యెత్తున ధర్నాకు పూనుకుంది ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌. అయితే నిర్మాత మండలి మాత్రం ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌కు తలొగ్గే పరిస్ధితి కనిపించడం లేదు. 30 శాతం వేతనాలు పెంచాలని ఎంప్లాయ్‌ ఫెడరేషన్‌ పెట్టిన ప్రతిపాదనను నిర్మాతల మండలి నిర్ధ్వందంగా తోసి పుచ్చింది. అంత స్ధాయిలో వేతనాలు పెంచడం అసాధ్యమని నిర్మాతల మండలి తేల్చేసింది. కార్మికుల బెదిరింపులకు భయపడే ప్రసక్తేలేదని కొత్తవాళ్ళతో షూటింగ్‌లు నిర్వహిస్తామని ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించింది. అంతే కాకుండా సిని పరిశ్రమకు పని వచ్చే నిపుణులు, సిబ్బందిని తీసుకోవడానికి నోటిఫికేషన్‌ కూడా జారీ ఛాంబర్‌ జారీ చేసింది. దీంతో సినీ కార్మికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరోవైపు ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సభ్యులకు ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌ తమ సంఘీభావం తెలియజేసింది. ఈ విషయంపై మరోసారి నేడు మంగళవారం నిర్మాతలు, ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతినిధులు భేటీ కానున్నారు. వీరి భేటి అనంతరం నిర్మాతల మండలి లేబర్‌ కమిషనర్‌ని కలవాలని నిర్ణయించారు.

ఇదిలా ఉంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటికే చాలా ఇబ్బందికర పరిస్థితులలో ఉంది. ఇటువంటి సమయంలో వేతనాలు పెంచడం, అందులోనూ కార్మిక శాఖ కమీషనర్ మార్గదర్శకత్వంలో, సామరస్యపూర్వక పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్న సందర్భంలో ఫెడరేషన్ లేబర్ కమీషనర్ గారి మాటను ధిక్కరిస్తూ 03-08-2025వ తేదిన 04-08-2025 తేది నుండి 30% వేతనాలు, ప్రొడ్యూసర్ నుండి సంబంధిత కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన వారికి మాత్రమే, సంబంధిత లెటర్ ఫెడరేషన్ ద్వారా యూనియన్లకు తెలియచేసిన తరువాత మాత్రమే విధులకు వెళ్ళాలని నిర్ణయించడం చాలా బాధకరం, ఇది నిజాయితీతో కూడిన చర్చల స్ఫూర్తిని దెబ్బ తీస్తుందని నిర్మాతల మండలి కార్యదర్శి కేఎల్‌.దామోదరప్రసాద్‌ అభిప్రాయం వెలిబుచ్చారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చిన్న నిర్మాతలు భరించలేని స్థాయిలో వేతనాలు పెంపును యూనియన్స్ డిమాండ్ చేయటం చిన్న నిర్మాతలకు ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ఎవరైతే వైపుణ్యం కలిగిన వర్కర్స్ తామివ్వగలిగే వేతనానికి పనిచేస్తారో వారెవరైనప్పటికి వారి యూనియన్లో ఉన్నా లేకున్నా వాళ్ళతో షూటింగ్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఎంతోమంది. ఔత్సాహిక నిపుణులు, కార్మికులు ఇండస్ట్రీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ యూనియన్లలో సభ్యత్వం కొరకు లక్షలాది రూపాయలు డిమాండ్ చేస్తూ వారి ప్రవేశానికి సదరు యూనియన్లు వారు అవరోధం కలిగిస్తున్నారని దామోదర ప్రసాద్‌ ఆరోపించారు. ఇది ఎంతో మంది నైపుణ్యవంతులైన కార్మికుల పొట్ట కొట్టడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ప్రాజెక్టు అవసరాలు మరియు వ్యక్తుల సామర్థ్యాల ఆధారంగా కార్మికులతో కలిసి పనిచేసే పూర్తి స్వేచ్చ నిర్మాతలకు ఉంటుందని దామోదర ప్రసాద్‌ స్పష్టం చేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story