Dhee choreographer : ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణ పై లైగింక వేధింపుల కేసు
కొరియోగ్రాఫర్ కృష్ణను బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు

మరో కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. ప్రముఖ రియాలిటీ డ్యాన్స్ షో ఢీ ప్రోగ్రామ్‌కి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న కృష్ణ మాస్టార్‌పై ఓ మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడానే ఆరోపణలపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కొరియోగ్రాఫర్ కృష్ణను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని అతని సోదరుడి నివాసంలో కృష్ణ మాస్టర్‌ని అదుపుతోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు అతన్ని హైదరాబాద్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలిక కుటుంబ సభ్యులు కృష్ణ మాస్టర్‌పై ఫిర్యాదు చేశారు, గత నెలలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కూడా ఇదే కేసు నమోదైంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేయడంతో కొరియోగ్రఫర్ కృష్ణ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇటీవల కృష్ణ మాస్టర్ ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొన్ని రోజులకే భార్యకు సంబంధించి రూ. 9.50 లక్షల నగదు దొంగిలించి పరారీలో ఉన్నాడు. కృష్ణ మాస్టర్‌పై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనేక మంది యువతులు, మహిళలను మోసం చేసినట్లు అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు కొరియోగ్రఫర్ కృష్ణ మాస్టర్‌ని లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేశారు.
