Shah Rukh Injured During Shoot: షూటింగ్ లో గాయపడ్డ షారూఖ్ .. అమెరికాకు తరలింపు.!
అమెరికాకు తరలింపు.!

Shah Rukh Injured During Shoot: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తన న్యూ మూవీ కింగ్' షూటింగ్ సమయంలో గాయపడినట్లు ప్రచారం జరుగుతోంది. ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో 'కింగ్' సినిమా కోసం ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కండరాల గాయం అని.. .. తీవ్రమైనది కానప్పటికీ, ట్రీట్ మెంట్ కోసం షారుఖ్ ఖాన్ తన బృందంతో కలిసి అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. వైద్యులు అతనికి ఒక నెలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో షారుఖ్ ఖాన్ బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఈ గాయం కారణంగా 'కింగ్' సినిమా షూటింగ్ షెడ్యూల్ పై ప్రభావం చూపుతోంది. షారుఖ్ ఖాన్ కోలుకున్న తర్వాత సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు సినిమా షూటింగ్ వాయిదా వేసినట్లు సమాచారం. షారుఖ్ ఖాన్ గతంలో కూడా పలు సినిమాల షూటింగ్ సమయంలో గాయపడ్డారు.
