Shah Rukh Khan Back in Don 3: బాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ అండ్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఫ్రాంచైజీ డాన్ 3 ప్రాజెక్టుకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక సెన్సేషనల్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా లైనప్ మొత్తం ఊహించని మలుపులు తిరుగుతూ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ నుండి యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్ తప్పుకోవడంతో మేకర్స్ అంతా మళ్లీ మొదటికి వచ్చి తిరిగి కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వడానికి షారుక్ ఒక మైండ్ బ్లోయింగ్ కండిషన్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

అట్లీ వస్తేనే డాన్ వస్తాడు.. షారుక్ కండిషన్..

గతంలో వచ్చిన డాన్, డాన్ 2 చిత్రాలలో తన స్టైలిష్ యాక్టింగ్‌తో ఈ పాత్రకు గ్లోబల్ ఇమేజ్ తెచ్చారు షారుక్ ఖాన్. అయితే డాన్ 3 స్క్రిప్ట్ లైన్ నచ్చకపోవడంతో ఆయన గతంలో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత మేకర్స్ రణ్‌వీర్ సింగ్‌ను హీరోగా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు రణ్‌వీర్ కూడా ఈ సినిమా నుండి వైదొలగడంతో.. నిర్మాతలు మరోసారి షారుక్ ఖాన్‌తో చర్చలు జరిపారు.

ఈ క్రమంలోనే షారుక్ ఒక ఆసక్తికరమైన షరతు విధించినట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. జవాన్ చిత్రంతో తనకు వెయ్యి కోట్ల భారీ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీకి కనుక డాన్ 3 దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తేనే తాను ఈ సినిమా చేస్తానని షారుక్ స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

హీరోయిన్ రేసులో కృతి సనన్.. విలన్‌గా విజయ్ దేవరకొండ?

హీరో మార్పుతో పాటు ఈ సినిమా కాస్టింగ్‌లోనూ భారీ మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ ప్రాజెక్ట్ కోసం కియారా అడ్వాణీ పేరు పరిశీలనలోకి వచ్చినా, ప్రస్తుత సమాచారం ప్రకారం బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ దాదాపు ఖరారైనట్లు టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పాటు హిందీ నటుడు విక్రాంత్ మాస్సే పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

ఒకవేళ షారుక్ ఖాన్ పెట్టిన కండిషన్‌కు మేకర్స్ ఓకే చెప్పి, అట్లీ చేతికి డాన్ 3 ప్రాజెక్ట్ వెళ్తే మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఊహాగానాలపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story