ఆది ఖాతాలో హిట్ పడిందా.?

Shambala Public Talk: ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టికల్ థ్రిల్లర్ 'శంబాల' (Shambhala) ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్ నుంచి, ప్రీమియర్ షోల నుంచి వస్తున్న పబ్లిక్ టాక్ చాలా సానుకూలంగా ఉంది.

1980వ దశకంలో 'శంబాల' అనే మారుమూల గ్రామంలో ఒక ఉల్క పడుతుంది. ఆ తర్వాత ఆ ఊరిలో వరుసగా వింత సంఘటనలు, మరణాలు చోటుచేసుకుంటాయి. దీనిపై పరిశోధన చేయడానికి వెళ్ళిన జియో సైంటిస్ట్ విక్రమ్ (ఆది), ఆ ఊరి మూఢనమ్మకాలకు, సైన్స్‌కు మధ్య జరిగే ఘర్షణను ఎలా ఎదుర్కొన్నాడు? ఆ ఉల్క వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? అన్నదే ఈ చిత్ర కథ.

సినిమా మొదటి 5 నిమిషాల నుంచే ప్రేక్షకులను 'శంబాల' ప్రపంచంలోకి తీసుకెళ్తుందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. దర్శకుడు యుగంధర్ ముని రాసుకున్న కథనంలో సస్పెన్స్, మిస్టిక్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.ఆది సాయికుమార్ తన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని, ఈ సినిమాతో ఆయనకు సాలిడ్ కంబ్యాక్ లభించిందని అభిమానులు చెబుతున్నారు. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకు ప్రాణం పోసింది. ముఖ్యంగా హారర్,భక్తికి సంబంధించిన సన్నివేశాలలో మ్యూజిక్ వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కూడా క్వాలిటీగా ఉన్నాయి.

ఇంటర్వెల్ ముందు వచ్చే 15 నిమిషాల సీక్వెన్స్, సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ ఎమోషనల్ యాక్షన్ సీన్లు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు కొంచెం నెమ్మదిగా సాగుతాయని, కొన్ని సన్నివేశాలు ఊహకు అందేలా ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి 'శంబాల' ఒక మంచి మిస్టికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్. వైవిధ్యమైన సినిమాలు ఇష్టపడే వారికి, థ్రిల్లర్ జానర్ ప్రేమికులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story