Sharwanand : మహేష్ బాబు సినిమాలో శర్వానంద్ ?
శర్వానంద్ ?

Sharwanand : మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఒక ప్రతిష్టాత్మక చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో శర్వానంద్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇది కేవలం పుకారు మాత్రమే. గతంలో కూడా శర్వానంద్, మహేష్ బాబు నిర్మాణ సంస్థ అయిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఒక సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తలు నిజం కాలేదు. తంలో శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా టీజర్‌ను మహేష్ బాబు తన సోషల్ మీడియాలో విడుదల చేశారు. వారి మధ్య మంచి స్నేహ సంబంధం ఉంది . ఈ కారణంగానే వారిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారని పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. శర్వానంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో భోగి అనే సినిమాలో నటిస్తున్నారు. నిమా కథ 1960వ దశకం నేపథ్యంతో ఉంటుందని తెలుస్తోంది. పీరియాడిక్ మూవీ కావడం వల్ల సెట్టింగ్‌లు మరియు వస్త్రధారణలు కూడా ఆ కాలానికి తగ్గట్టుగా ఉంటాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో ఈ సినిమా కథ నడుస్తుంది. రక్తపాతంతో కూడిన ఘర్షణలు, తిరుగుబాటు వంటి అంశాలు ఇందులో ప్రధానంగా ఉంటాయని అంచనా. ఈ సినిమాలో శర్వానంద్‌తో పాటు అనుపమ పరమేశ్వరన్ మరియు డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్ 'శ్రీ సత్యసాయి ఆర్ట్స్' బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా కిరణ్ కుమార్ మన్నె పనిచేస్తున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో భారీ సెట్ వేశారు. అక్కడ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది.అలాగే, శర్వానంద్ నటించిన మనమే చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది.
