Sharwanand’s Biker: సమ్మర్‌లో శర్వానంద్ బైకర్ రిలీజ్
శర్వానంద్ బైకర్ రిలీజ్

Sharwanand’s Biker: ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో హిట్ అందుకున్న శర్వానంద్.. సమ్మర్‌లో మరో మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. శర్వా హీరోగా అభిలాష్ కంకర రూపొందించిన ‘బైకర్’ సినిమా రిలీజ్ డేట్‌ను మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు తెలియజేశారు. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో శర్వా బైకర్ లుక్‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేశాడు. 1990–2000 బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ మూవీ రేసింగ్ యాక్షన్‌తో పాటు ఎమోషనల్, మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతోందని మేకర్స్ చెప్పారు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, సాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.

