Sharwanand: ముగ్గురు భామలతో శర్వానంద్ ఆటపాట!
శర్వానంద్ ఆటపాట!

Sharwanand: యంగ్ హీరో శర్వానంద్ సక్సెస్ కోసం పోరాటం చేస్తున్నాడు. కొంత కాలంగా విజయాలు ఆయన చెంత చేరకపోవడంతో కసిగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న మూడు సినిమాలు ఆన్ సెట్స్‌లో ఉన్నాయి. వాటిలో రాము అబ్బరాజు తెరకెక్కిస్తున్న నారీ నారీ నడుమ మురారీ మూవీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇందులో శర్వాకి జోడీగా ముగ్గురు భామలు నటి స్తున్నారు. సాక్షి వైద్య, సంయుక్త మీనన్ తో పాటు మరో భామ నటిస్తు న్నట్లు సమాచారం. అదే విధంగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న భోగి మూవీలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులోనూ మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందని సమాచారం. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఇక వీటితో పాటు 36వ చిత్రం కూడా ప్రకటించా రు. కానీ ఈ సినిమా ఇంకా పట్టాలెక్కనున్నట్లు లేదు. ఇందులో కూడా కథా సుగుణంగా ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. గతంలో ఇద్దరు భామల ముద్దుల ప్రియుడిగా నటించిన శర్వానంద్. ముగ్గురు భామల ముద్దుల ప్రియుడు అవ్వడం ఇదే తొలిసారి. మరి శర్వా ఆన్ సెట్స్ అనుభవాలు ఎలా ఉన్నాయన్నది త్వరలోనే బయట పడుతుంది.
