Sharwanand–Srinu Vaitla Film: శర్వానంద్ - శ్రీను వైట్ల మూవీ ప్రారంభం
ప్రారంభం

Sharwanand–Srinu Vaitla Film: టాలీవుడ్ యువ హీరో శర్వానంద్, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల, మరియు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంకర కలయికలో రూపొందనున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ఈరోజు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో పూజా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘కింగ్’, ‘దూకుడు’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రీను వైట్ల, మరోసారి తన మార్క్ హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్ జోనర్‌లోకి రీఎంట్రీ ఇస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా కోసం ఆయన మొదటిసారిగా హీరో శర్వానంద్‌తో చేతులు కలిపారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది సంక్రాంతి పండగ కానుకగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అనిల్ సుంకర తన సొంత నిర్మాణ సంస్థ అయిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
- SharwanandSrinu VaitlaSharwanand New MovieTelugu CinemaTollywoodAK EntertainmentsMovie LaunchPooja CeremonyUpcoming Telugu MovieEntertainment NewsFilm NewsTelugu Movie UpdatesTollywood NewsSankranti ReleaseLatest Telugu NewsIndian CinemaMovie AnnouncementCinema UpdatesTelugu EntertainmentLatest Movie News

