సోషల్‌ మీడియాలో వెల్లడి

Shilpa Shetty : సినీ నటి శిల్పా శెట్టి ముంబైలోని తన ప్రసిద్ధ రెస్టారెంట్ బాస్టియన్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయం రూ. 60 కోట్ల మోసం ఆరోపణల నేపథ్యంలో తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముంబైకి చెందిన దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై మోసం చేశారని ఆరోపించారు. 2015 నుంచి 2023 మధ్య కాలంలో వారి పాత కంపెనీ 'బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్'లో పెట్టుబడులు పెట్టే పేరుతో తనను రూ. 60 కోట్లు మోసం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యాపార విస్తరణ కోసం డబ్బు తీసుకున్నారని, కానీ ఆ నిధులను వ్యక్తిగత అవసరాలకు వాడారని కొఠారి ఆరోపించారు.ఈ ఆరోపణలపై ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే శిల్పా శెట్టి తన సోషల్ మీడియాలో 'బాస్టియన్' రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.అయితే, ఈ మూసివేతకు గల కారణాన్ని ఆమె స్పష్టంగా వెల్లడించలేదు. తన పోస్ట్‌లో, "ఈ గురువారం 'బాస్టియన్ బాంద్రా'కు వీడ్కోలు చెబుతున్నాం. ఇది మాకు లెక్కలేనన్ని మధుర జ్ఞాపకాలను, మరచిపోలేని రాత్రులను ఇచ్చింది. ఇకపై ఈ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నాం" అని భావోద్వేగంగా రాశారు.ఆమెకు ముంబైలో ఉన్న 'బాస్టియన్ అట్ ది టాప్' అనే మరో రెస్టారెంట్ యథావిధిగా కొనసాగుతుందని కూడా ఆమె స్పష్టం చేశారు. 'బాస్టియన్' రెస్టారెంట్ శిల్పా శెట్టికి, ఆమె వ్యాపార భాగస్వామి రంజిత్ బింద్రాకు చెందినది. 2016లో ఇది ప్రారంభమైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story