Shiva Balaji: ప్రభాస్ తోనే కన్నప్పకు అంత రేంజ్
కన్నప్పకు అంత రేంజ్

Shiva Balaji: కన్నప్ప గురించి శివబాలాజీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రభాస్ సీన్స్ తోనే కన్నప్ప రేంజ్ పెరిగిందన్నాడు.. కన్నప్ప రేపు విడుదలవుతున్న సందర్భంగా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన శివబాలాజీ కన్నప్ప గురించి మాట్లాడాడు.
కన్నప్ప సినిమాలో మోహన్ బాబు కొడుకుగా కనిపిస్తా. సినిమా డిస్కషన్స్ టైమ్‌లో నాకు ఇవ్వదగ్గ పాత్ర ఇందులో లేదన్నారు విష్ణు. కానీ మోహన్ బాబు గారు కచ్చితంగా నేను ఈ ప్రాజెక్ట్ లో ఉండాలని పట్టుపట్టారు. దీంతో కొన్ని రోజుల తర్వాత మహదేవశాస్త్రి కొడుకు పాత్రకు బాగుంటానని ఫైనల్ చేశారు. పాత్రనిడివి, ప్రాముఖ్యత తక్కువ అయినప్పటికీ ఓ గొప్ప సినిమాలో భాగమవడం హ్యాపీ. న్యూజిలాండ్‌లో రెండు నెలల పాటు మోహన్ బాబు గారితో కలిసి షూటింగ్ పాల్గొన్నాను. ఆయన ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ వేరుగా ఉంటారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు పని చేస్తున్నప్పటి నుంచి నేను, విష్ణు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాం. కానీ మోహన్ బాబు గారికి దగ్గరవ్వడం కష్టం.. దగ్గరైతే ఇలా ప్రేమతో కట్టి పడేస్తారు. సినిమా అద్భుతంగా వచ్చింది. సెకండాఫ్‌లో ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా రేంజ్ పెరిగింది. ప్రభాస్, విష్ణు పాత్రల మధ్య డైలాగ్స్ ఇంప్రెస్ చేస్తాయి. మోహన్ లాల్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అక్షయ్ కుమార్ పాత్ర సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అని చెప్పుకొచ్చాడు బాలాజీ
