Shobita Dhulipala’s Power as Sandhya: సంధ్యగా శోభితా ధూళిపాళ్ల ప్రతాపం.. చీకటిలో దాగి ఉన్న రహస్యాలేమిటి?
చీకటిలో దాగి ఉన్న రహస్యాలేమిటి?

Shobita Dhulipala’s Power as Sandhya: విభిన్నమైన పాత్రలతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటి శోభితా ధూళిపాళ్ల. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ చీకటిలో. ఈ నెల 23వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇందులో తను పోషించిన సంధ్య అనే పవర్‌ఫుల్ పాత్ర గురించి శోభిత ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మొండితనం.. నిజాయితీ కలగలిసిన సంధ్య
ఈ చిత్రంలో శోభిత ఒక ట్రూ క్రైమ్ పాడ్‌కాస్టర్ పాత్రలో కనిపిస్తారు. తన పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ.. "సంధ్య చాలా ముక్కుసూటిగా ఉండే అమ్మాయి. ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా తన ఆశయాల కోసం పోరాడే స్వతంత్ర భావాలున్న వ్యక్తి. ఆమె మొండితనానికి వెనుక ఒక బలమైన కారణం, గతం ఉన్నాయి. హైదరాబాద్ నేపథ్యం ఉన్న పాత్ర కావడంతో ఇందులో నటించడం నాకు చాలా సహజంగా అనిపించింది" అని వివరించారు.
ప్రైమ్ వీడియోతో విడదీయలేని బంధం
మేడ్ ఇన్ హెవెన్ సిరీస్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సంచలనం సృష్టించిన శోభితకు ప్రైమ్ వీడియోతో ఇది మరో క్రేజీ ప్రాజెక్ట్. ఈ ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకమని పేర్కొన్న ఆమె, జనవరి 23న ప్రేక్షకులు సంధ్య రూపంలో తనలోని సరికొత్త కోణాన్ని చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.
కథా నేపథ్యం - ఇతర వివరాలు
హైదరాబాద్ వీధుల నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ డ్రామాలో, నగరంలోని కొన్ని చీకటి రహస్యాలను బయటపెట్టే క్రమంలో సంధ్యకు ఎదురైన సవాళ్లేమిటి? అనేది ప్రధానాంశం. ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటించగా.. ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, చైతన్య విశాలాక్షి, వడ్లమాని శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు నిర్మించారు.

