మరో మూడు కేసుల్లో అరెస్ట్

Shock for iBOMMA Ravi: పైరసీ నిర్వాహకుడు ఐబొమ్మ ఇమ్మడి రవిని మరో మూడు కేసుల్లో అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. రవిని నిన్న నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు . . మంచు విష్ణు, దిల్ రాజు, తండేల్ మూవీ పైరసీ పట్ల రవిపై ఫిర్యాదు చేయడంతో మూడు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రవికి బెయిల్ మంజూరు చేయవద్దని, విదేశాలకు వెళ్లిపోయి ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరఫు లాయర్ కోర్టులో వాదించారు. దీంతో 14 రోజుల రిమాండ్‌ను విధించింది నాంపల్లి కోర్టు. దీంతో బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఇప్పటికే ఒక కేసులో రవిని ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ పూర్తి చేశారు. మిగిలిన కేసులకు సంబంధించి కూడా పోలీసులు పీటీ వారెంట్ (Prisoner Transit Warrant) దాఖలు చేశారు.ప్రస్తుతం రవి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పైరసీ, బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్‌ల ద్వారా రవి వందల కోట్లు సంపాదించినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story